High Court on TDP Leaders Petitions on Angallu Incident: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పుంగనూరు పర్యటన సందర్భంగా అన్నమయ్య జిల్లా అంగళ్లులో చోటు చేసుకున్న ఘటనపై టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ముందస్తు బెయిలు పిటిషన్లు ఎందుకు వేసుకోకూడదని పిటిషనర్లయిన టీడీపీ నేతలకు హైకోర్టు సూచించింది. హత్యాయత్నం (307 ఐపీసీ) సెక్షన్ కింద కేసు నమోదు అయినందున ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ దాఖలైన ప్రస్తుత వ్యాజ్యాలపై ఈ దశలో విచారణ చేయలేమని కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
AP High Court Key Questions on Ruling Party Leaders: పుంగనూరు, అంగళ్లు ఘటనపై అధికార పార్టీ నాయకులకు హైకోర్టు సూటి ప్రశ్నలు
Angallu Incidents Updates: అంగళ్లు ఘటన నేపథ్యంలో ముదివేడు పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని, ఆ కేసు ఆధారంగా తమపై తొందరపాటు చర్యలు తీసుకోకుండా నిలువరించాలని కోరుతూటీడపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు షాజహాన్ భాష, డి.రమేశ్, టీడీపీ నేత గంటా నరహరి, తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు.
Tension in annamaiya district: రణరంగంగా మారిన పుంగనూరు.. టీడీపీ శ్రేణులకు గాయాలు.. పలు వాహనాలు ధ్వంసం..
TDP Leaders Anticipatory Bail Petition on Angallu Incident: బెయిలు పిటిషన్లపై విచారణ నేటికి వాయిదా:అలాగే అంగళ్లు ఘటనలో ముదివేడు పోలీసులు నమోదు చేసిన కేసులో ముందుస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు, పీలేరు టీడీపీ ఇంఛార్జి నల్లారి కిశోర్‌కుమార్ రెడ్డి, పులివర్తి నాని హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ గురువారానికి వాయిదా పడ్డాయి. తాజాగా(బుధవారం) జరిగిన విచారణలో పూర్తి స్థాయి వాదనలు వినేందుకు సమయం లేకపోవడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేశ్‌రెడ్డి విచారణను గురువారానికి వాయిదా వేశారు.
Punganur Violence: పుంగనూరు రణరంగం.. చంద్రబాబు యాత్రకు అడుగడుగునా అడ్డంకులు.. ప్రశ్నించిన ప్రతిపక్ష శ్రేణులపై లాఠీఛార్జి
అంతకు ముందు నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి తరఫున న్యాయవాది ఎన్వీ సుమంత్ వాదనలు వినిపించారు. ఈ ఘటనతో పిటిషనర్‌కు సంబంధం లేదన్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న తుపాకీ.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మరో వ్యక్తికి చెందిన ప్రైవేటు సెక్యూరిటీది అని తెలిపారు. గన్‌కి లైసెన్సు ఉందన్నారు. ఘటన జరిగిన సమయంలో పిటిషనర్ కారులో లేరన్నారు. బెయిలు మంజూరు చేయాలని కోరారు. పోలీసుల తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ప్రైవేటు సెక్యూరిటీ తుపాకీ తీసుకొని కారు డ్రైవర్ ఫిర్యాదు దారుడిని బెదిరించారన్నారు. పిటిషనర్లతో పాటు ఇతరుల ప్రోద్భలంతోనే దాడులకు పాల్పడ్డారన్నారు. కాగా తదుపరి వాదనలు వినేందుకు ఈ కేసు విచారణను ఈరోజుకి వాయిదా వేశారు.
Chandrababu angry on Illegal cases against Tdp leaders పుంగనూరు ఘటనలో టీడీపీ నేతలపై అక్రమ కేసులు.. చంద్రబాబు ఆగ్రహం