ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం జగన్ పర్యటనలో మహిళల ఇక్కట్లు - 'పాల్గొనకుంటే 50రూపాయల ఫైన్'

AP CM YS Jagan Rayachoti Tour: అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో గురువారం జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. సీఎం జగన్ టూర్​లో తాగునీరు కూడా అందించకపోవటంతో మహిళలు తీవ్ర అవస్థలు పడ్డారు.

AP_CM_YS_Jagan_Rayachoti_Tour
AP_CM_YS_Jagan_Rayachoti_Tour

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 9, 2023, 7:29 PM IST

Updated : Nov 9, 2023, 7:35 PM IST

సీఎం జగన్ పర్యటనలో మహిళల ఇక్కట్లు - 'పాల్గొనకుంటే 50రూపాయల ఫైన్'

AP CM YS Jagan Rayachoti Tour: సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉందంటే చాలు.. ఆ ప్రాంత ప్రజలంతా భయపడిపోతున్నారు. సీఎం టూర్ సందర్భంగా అ‍ధికారులు ప్రదర్శించే అత్యుత్సాహం.. ఏం అవస్థలు తెస్తుందోనని బెంబేలెత్తిపోతున్నారు. చెట్ల నరికివేత, ట్రాఫిక్‌ నిలిపివేత, పర్యటనకు రాకపోతే ఊరుకునేది లేదన్న అధికారుల హుకూంతో నానా అవస్థలు పడుతున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో సీఎం పర్యటన ప్రజలకు కష్టాలు తెచ్చిపెట్టింది.

సీఎం పర్యటన కోసం స్కూళ్లకు సెలవా!- విద్యార్థి సంఘాల ఆగ్రహం

Arrangements for CM Visit in Annamayya District: అన్నమయ్య జిల్లా రాయచోటిలో సీఎం జగన్ పర్యటించారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ జకియా ఖానం కుమారుడి వివాహానికి జగన్‌ హాజరయ్యారు. సీఎం టూర్ సందర్భంగా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. శుద్ధలోళ్లపల్లి నుంచి కల్యాణ మండపం వరకు రోడ్డుకు ఇరువైపులా ఇనుప బారికేడ్లతో రక్షణ వలయాన్ని పెట్టారు. వేలాది మంది పోలీసులు బందోబస్తుగా నిలిచారు. సచివాలయ సిబ్బందిని కూడా బారికేడ్ల వద్ద విధుల్లో ఉంచి.. వారి ద్వారా సీఎంకు వినతి పత్రాలు ఇప్పించారు. ప్రజల నుంచి వినతులు తీసుకోవాల్సింది పోయి.. సచివాలయ సిబ్బంది నుంచి తీసుకోవడం ఏంటని చాలా మంది ము‌క్కున వేలేసుకున్నారు.

రెండు రోజుల పాటు అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాలో సీఎం జగన్ పర్యటన

సీఎం పర్యటన ఎక్కడ జరిగినా డ్వాక్రా మహిళలు తప్పకుండా రావాలని హెచ్చరించే అధికారులు.. రాయచోటిలోనూ అదే పద్ధతి అనుసరించారు. ఇంకో అడుగు ముందుకేసి.. పర్యటనకు రాకుంటే 50 రూపాయల జరిమానా చెల్లించాలని మెప్మా (Mission for Elimination of Poverty in Municipal Areas) అధికారులు హెచ్చరించినట్లు తెలిసింది. సీఎంకు స్వాగతం పలికేందుకు డ్వాక్రా మహిళలను బారికేడ్లకు ఇరువైపులా నిలబెట్టారు.

Women Faced Problems in CM Jagan Tour: అయితే ఉదయం 10 గంటలకే రావాల్సిన సీఎం.. 2 గంటలు ఆలస్యంగా రావడంతో ఎండలో నిలబడలేక మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వెనుదిరిగి వెళ్లలేక మహిళలు అక్కడే లైన్లో కూర్చుని కనిపించారు. ఉదయం ఎప్పుడో వచ్చామని కనీసం తాగునీరు కూడా అందించలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కల్యాణ మండపానికి చేరుకోగానే చాలా మంది మహిళలు వెళ్లిపోయారు.

పుట్టపర్తిలో సీఎం జగన్ పర్యటన-ఎప్పటిలాగే ఆంక్షలు విధించిన ప్రభుత్వం-బోనస్​గా విద్యార్థులకు సెలవు ప్రకటన!

రాయచోటి నుంచి పులివెందుల వెళ్లిన సీఎం జగన్.. కొత్తగా నిర్మించిన కృష్ణుడి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం అక్కడి నుంచి శిల్పారామానికి వెళ్లారు. అక్కడ రోప్‌ వే, వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. శిల్పారామం నుంచి ఏపీ కార్ల్‌కు వెళ్లి.. అక్కడ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కాలేజీలను ప్రారంభించారు. అనంతరం స్వామినారాయణ గురుకులానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఆదిత్య బిర్లా గార్మెంట్స్‌ను సందర్శించారు.

పుట్టపర్తిలో సీఎం జగన్ పర్యటన-ఎప్పటిలాగే ఆంక్షలు విధించిన ప్రభుత్వం-బోనస్​గా విద్యార్థులకు సెలవు ప్రకటన!

Last Updated : Nov 9, 2023, 7:35 PM IST

ABOUT THE AUTHOR

...view details