ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Gold Scam: నకిలి బంగారం పెట్టి.. రూ. కోటీ 30 లక్షలతో ఉడాయించిన ఎస్బీఐ ఉద్యోగి - అన్నమయ్య జిల్లాలో బంగారం తాకట్టు పెట్టి దొపిడి

SBI Gold Scam: అన్నం పెట్టిన సంస్థకే కన్నం వేశాడో ప్రభుద్దుడు. తాను పని చేస్తున్న సంస్థలోనే చేతివాటం చూపించాడు. నకిలి బంగారాన్ని పెట్టి కోటి 30 లక్షల  రూపాయలను దశల వారిగా దారి మళ్లించాడు. పెనగలూరు మండలం ఓబిలిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్​లో బంగారం తాకట్టు పెట్టుకునే అప్రైజర్ శేఖరాచారి.. పని చేస్తున్న బ్యాంకునే మోసం చేశాడు. అధికారులు విచారణ ప్రారంభించడంతో రూ. కోటీ 30 లక్షలతో ఉడాయించాడు.

Gold Scam
Gold Scam

By

Published : Sep 21, 2022, 11:44 AM IST

Updated : Sep 21, 2022, 12:45 PM IST

SBI Gold Scam in AP: అన్నమయ్య జిల్లాలో బంగారం తాకట్టు పెట్టుకుని రుణాలిచ్చే బ్యాంకు ఉద్యోగే.. ఆ బ్యాంకుకే టోకరా పెట్టాడు. పెనగలూరు మండలం ఓబిలి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి శేఖరాచారి.. తెలిసిన వారిచేత నకిలీ బంగారం తాకట్టు పెట్టించి.. కోటి 30 లక్షలు కాజేశాడు. నకిలీ బంగారాన్ని స్వచ్ఛమైన పసిడిగా బ్యాంకు మేనేజర్‌కు చెప్పి రుణాలు ఇప్పించాడు. ఆ డబ్బును సంబంధిత వ్యక్తుల ఖాతాల్లోకి జమ కాగానే వాటిని తన ఖాతాల్లోకి మళ్లించుకున్నాడు. అంతర్గత విచారణలో కొంతకాలంగా శేఖరాచారి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు నిర్ధరణ అయింది. ఉన్నతాధికారులు విచారణ గురించి తెలుసుకున్న శేఖరాచారి పరారయ్యాడు.

Last Updated : Sep 21, 2022, 12:45 PM IST

ABOUT THE AUTHOR

...view details