Train: పాకాల-ధర్మవరం రైల్వేలైన్ మధ్య ప్యాసింజర్ రైలును ప్రమాదానికి గురి చేసేందుకు ఆగంతుకులు రైలుపట్టాలపై పాత ఇనుప పట్టాలు, ఇనుపరాడ్లు, రాళ్లను ఏర్పాటు చేసిన ఘటన అన్నమయ్య జిల్లా పరిధిలోని కలికిరి-వాల్మీకిపురం మధ్యలో మంగళవారం చోటుచేసుకుంది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వాల్మీకిపురం-కలికిరి రైల్వేలైనులోని 159వ మైలురాయి వద్ద రైలుపట్టాలపై పలుచోట్ల ఆగంతుకులు పాత రైలుపట్టాలు, ఇనుపరాడ్లు, రాళ్లు అడ్డంగా ఉంచారు. అక్కడకు సమీపంలో పాకాల-ధర్మవరం మధ్య రైల్వే విద్యుదీకరణ పనులు జరుగుతున్నాయి. ఆ కార్మికులు వాటిని గుర్తించి రైల్వే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే రైల్వే పోలీసులు చేరుకుని వాటిని తొలగించారు. అదే సమయంలో గుంతకల్- తిరుపతి ప్యాసింజరు రైలు నడవాల్సి ఉంది. అధికారుల అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ముమ్మర తనిఖీలతో పాటు విచారణ చేపట్టింది.
ప్యాసింజర్ రైలుకు తప్పిన ప్రమాదం.. పట్టాలపై ఇనుప రాడ్లు - ప్యాసింజర్ రైలుకు తప్పిన ప్రమాదం
పాకాల-ధర్మవరం రైల్వేలైన్ మధ్య ప్యాసింజర్ రైలును ప్రమాదానికి గురి చేసేందుకు ఆగంతకులు పట్టాలపై పాత ఇనుప పట్టాలు, ఇనుపరాడ్లు, రాళ్లు పెట్టారు. వాటిని గమనించిన కార్మికులు రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన అధికారులు వాటిని తొలగించారు.
train