SBI Employee was arrested: అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం ఓబిలి ఎస్బీఐ బ్యాంకులో నకిలీ బంగారంతో కోటి రూపాయలకుపైగా నగదు కాజేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కాకర్ల శేఖర్ 2015 నుంచి ఎస్బీఐ ఓబిలి బ్రాంచ్‌లో అప్రైసర్‌గా పని చేస్తున్నాడు. ఇతను రోల్డ్‌గోల్డ్ నగలు తాకట్టుపెట్టి రుణాలు తీసుకున్నాడు. కాకర్ల శేఖర్ ఇలా నకిలీ ఆభరణాలు పెట్టి.. 5 గోల్డ్ లోనులు, భార్య జయలక్ష్మీదేవి పేరిట నాలుగు గోల్డు లోనులు తీసుకున్నాడు. మొత్తం 13వందల 87 గ్రాముల నకిలీ బంగారం తనఖా పెట్టి 39లక్షల 41వేల రూపాయలు రుణం తీసుకున్నాడు. బాగా పరిచయమున్న 9మందిని నమ్మించి వారి పేరిట 3వేల 433గ్రాముల నకిలీ బంగారం తాకట్టుపెట్టి.. కోటి 52వేల రూపాయల రుణం తీసుకున్నాడు.
ఆశపడ్డాడు.. పని చేస్తున్న బ్యాంక్‌పై కన్నేశాడు.. ఆ తర్వాత..! - అప్రైసర్ కాకర్ల శేఖర్ బాగోతంతో బయటపడ్డ అవినీతి
SBI Employe: అందరిలా రోజంతా కష్టపడి ఎందుకు పని చేయాలనుకున్నాడో ఏమో.. తన వద్దకు వచ్చే బంగారాన్ని చూసి వాటికి విలువ కట్టాల్సిన అతనికి మనసులో దురాశ కలిగింది. అన్ని తానే అయినప్పుడు అడిగే వారెవ్వరు అనుకున్నాడు. అందుకోసం విడతల వారీగా బ్యాంక్‌లో నకిలీ బంగారాన్ని జమ చేస్తూ డబ్బులను కాజేశాడు. అలా ఒకటో, రెండో గ్రాములు కాదు సుమారు 1కేజీ 87 గ్రాముల నకిలీ బంగారాన్ని పెట్టి.. 39లక్షల 41వేల రూపాయలు రుణం తీసుకున్నాడు. అధికారుల తనిఖీల్లో విషయం బయటపడటంతో కటకటాలపాలయ్యాడు.
ఇలా తీసుకున్న డబ్బుతో విలువైన కార్లు, సెల్ ఫోనులు, బంగారు వంటి విలువైన వస్తువులు కొని.. జల్సాలకు అలవాటు పడ్డాడు. గత నెలలో ఓబిలి బ్రాంచ్‌లో త్రైమాసిక తనిఖీలు నిర్వహించిన సమయంలో గోల్డ్ లోనులకు సంబందించిన ఆభరణాలు పరిశీలించగా.. అప్రైసర్ కాకర్ల శేఖర్ బాగోతం బయటపడింది. 30 గోల్డ్ లోనులకు సంబంధించిన ఆభరణాలన్నీ నకిలీగా తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజంపేట రీజనల్ మేనేజరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొండూరు క్రాస్ వద్ద కాకర్ల శేఖర్‌ను అరెస్టు చేశారు. అనంతరం అతని వద్ద నుంచి డబ్బులు, విలువైన వస్తువులు సీజ్ చేశామని రాజంపేట డీఎస్పీ తెలిపారు.
ఇవీ చదవండి: