ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధిక వడ్డీ పేరుతో 170కోట్లు వసూలు - బోర్డు తిప్పేసిన కంపెనీ ప్రతినిధులు పోలీసుల అదుపులో - మనీ ఫ్రాడ్ కేసు

9FX Global Trading Company Cheating Case: అధిక వడ్డీ ఆశచూపి కోట్ల రూపాయలు వసూలు చేసుకుని.. ఉడాయించిన 9ఎఫ్ఎక్స్ గ్లోబల్ ట్రేడింగ్ కంపెనీ నిర్వాహకులను అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.

9FX_Global_Trading_Company_Cheating_Case
9FX_Global_Trading_Company_Cheating_Case

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2023, 12:22 PM IST

అధిక వడ్డీ పేరుతో 170కోట్లు వసూలు - బోర్డు తిప్పేసిన కంపెనీ ప్రతినిధులు పోలీసుల అదుపులో

9FX Global Trading Company Cheating Case: అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో ప్రజల నుంచి అనధికారికంగా రూ.కోట్లలో డిపాజిట్ వసూలు చేసిన 9ఎఫ్​ఎక్స్ గ్లోబల్ ట్రేడింగ్ కంపెనీ బాగోతాలను ఎట్టకేలకు పోలీసులు వెలికి తీశారు. ఇటీవల ప్రజల నుంచి సుమారు 200 కోట్ల రూపాయలు పైబడి డబ్బులు వసూలు చేసి ఉడాయించిన వ్యవహారంపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసు అధికారులు ఎట్టకేలకు సంస్థ నిర్వాహకులను అరెస్టు చేశారు.

Cheating with Gold Scheme: నమ్మకంగా ఉంటూ.. బంగారం, నగదు తీసుకుని

Money Fraud Case: 2019లో తిరుపతి, నెల్లూరు, కడప, రాయచోటిలో 9ఎఫ్ఎక్స్ గ్లోబల్ ట్రేడింగ్ కంపెనీ కార్యాలయాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులు.. 302 మంది ఏజెంట్ల ద్వారా డబ్బులు వసూళ్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. అధిక వడ్డీ ఆశచూపి.. 1,759 మంది నుంచి 170 కోట్ల రూపాయలు వసూలు చేసిన కంపెనీ ప్రతినిధులు.. ఈ ఏడాది ఏప్రిల్‌లో బోర్డు తిప్పేయడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Cyber Fraud With Fake Fingerprints: నకిలీ వేలిముద్రలతో రూ.6 కోట్లు కాజేసిన ముఠా అరెస్టు

9FX Cheating Six Accused Arrest: కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి కంపెనీ నిర్వాహకులైన ఆరుగురినిఅదుపులోకి తీసుకున్నారు. డిపాజిటర్ల నుంచి వసూలు చేసిన డబ్బులను.. కమీషన్‌ రూపంలో ఏజెంట్లకు 65 కోట్ల రూపాయలు కంపెనీ చెల్లించినట్లు రికార్డులో ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో రాయచోటికి చెందిన రాజేశ్‌, తిరుపాల్‌రెడ్డి, సుబ్బారెడ్డి, తిరుపతికి చెందిన రసూల్‌ సాబ్‌, యోగానంద చౌదరి, అనిల్‌ కుమార్‌ను అరెస్టు చేసినట్లు డీఎస్పీ మహబూబ్ బాషా వెల్లడించారు. నిర్వాహకుల నుంచి ఎటువంటి నగదు రీకవరీ కాలేదని డీఎస్పీ తెలిపారు.

"అధిక వడ్డీ ఆశచూపి కోట్ల రూపాయలు వసూలు చేసుకుని.. ఉడాయించిన 9ఎఫ్ఎక్స్ గ్లోబల్ ట్రేడింగ్ కంపెనీ నిర్వాహకులను అరెస్టు చేశాం. 2019లో తిరుపతి, నెల్లూరు, కడప, రాయచోటిలో 9ఎఫ్ఎక్స్ గ్లోబల్ ట్రేడింగ్ కంపెనీ కార్యాలయాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులు.. 302 మంది ఏజెంట్ల ద్వారా డబ్బులు వసూళ్లు చేశారు. అధిక వడ్డీ ఆశచూపి.. 1,759 మంది నుంచి 170 కోట్ల రూపాయలను కంపెనీ ప్రతినిధులు వసూలు చేశారు. అనంతరం ఈ ఏడాది ఏప్రిల్‌లో బోర్డు తిప్పేశారు. దీంతో బాధితులు మా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి.. విచారణ చేపట్టి కంపెనీ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నాం. ఈ కేసులో రాయచోటికి చెందిన రాజేశ్‌, తిరుపాల్‌రెడ్డి, సుబ్బారెడ్డి, తిరుపతికి చెందిన రసూల్‌ సాబ్‌, యోగానంద చౌదరి, అనిల్‌ కుమార్‌ను అరెస్టు చేశాం. నిర్వాహకుల నుంచి ఎటువంటి నగదు రీకవరీ కాలేదు." - మహబూబ్ బాషా, రాయచోటి డీఎస్పీ

Extra Income Scam : ఘరానా మోసం.. అదనపు ఆదాయమని నమ్మించి.. 19 లక్షలు వసూలు.. చివరకు

ABOUT THE AUTHOR

...view details