ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 5PM - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

.

ప్రధాన వార్తలు
top news

By

Published : Dec 13, 2022, 5:00 PM IST

  • మూడు రాజధానులను నిరసిస్తూ 'ధరణి కోట నుంచి ఎర్రకోట'
    సీఎం జగన్​ మూడు రాజధానుల ప్రకటన చేసి మూడేళ్లవుతున్న సందర్భంగా దిల్లీలో నిరసన తెలపాలని అమరావతి ఐకాస నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 17, 18, 19 తేదీల్లో దిల్లీ వేదికగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అమరావతి ఐకాస నేతలు ప్రకటించారు. ధరణికోట నుంచి ఎర్రకోట వరకూ నిరసన యాత్ర ఉంటుందన్నారు. 1800 మందితో ప్రత్యేక రైలులో రాజధాని రైతులు దిల్లీ వెళ్తారని తెలిపారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • జరిమానా విధించారని.. పోలీసులతో యువకుడు వాగ్వాదం
    ఈ-చలానాలు వసూలు చేస్తున్న ట్రాఫిక్​ పోలీసులతో ఓ వాహనదారుడు వాగ్వాదానికి దిగాడు. కర్నూలులో ఈ చలానాలు వసూలు చేస్తున్న ట్రాఫిక్​ పోలీసులు.. ఓ వాహనాన్ని ఆపి పెండింగ్​ ఉన్న చలానా కట్టాలని కోరారు. దీంతో యువకుడు రెచ్చిపోయి ట్రాఫిక్​ పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఘటన కర్నూలులో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భూముల రీసర్వే కోసం మున్సిపాలిటీల చట్ట సవరణకు మంత్రివర్గం పచ్చజెండా
    రాష్ట్రంలో ఏపీ పంప్డ్‌ స్టోరేజ్ పవర్ ప్రమోషన్ పాలసీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. భూముల రీసర్వే కోసం మున్సిపాలిటీల చట్ట సవరణతోపాటు.. బాపట్ల, పల్నాడు అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కొత్త జిల్లాల్లో వైకాపా కార్యాలయాల నిర్మాణానికి స్థలాల కేటాయింపులకు కేబినేట్ ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజైన డిసెంబర్‌ 21న 5 లక్షల ట్యాబ్‌ల పంపిణీ చేసేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆహా ఏమి సోయగాలు.. ఈ అందాలను మాటల్లో వర్ణించతరమా
    గలగలమంటూ సాగే నీటి సవ్వడులు... వినసొంపైన పక్షుల కిలకిల రావాలు... పర్యాటకుల మదిని దోచి, ప్రకృతి ప్రేమికులకు చూడముచ్చటైన అందాలను ఆరబోసినట్లుగా కనువిందు చేస్తున్న దృశ్యాలు... ఇవన్నీ ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలంలోని భైరవకోనలో దర్శనమిస్తున్నాయి. ఎత్తైన కొండల పైనుంచి జాలువారుతున్న జలపాతం అందరినీ ఆకట్టుకుంటోంది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కాలువలో ఆరు కొండచిలువలు రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్
    కేరళలో కొండచిలువలు కలకలం సృష్టించాయి. సోమవారం కోజికోడ్​ నగర శివారులోని కరపరంభ ప్రాంతంలోని కనోలీ కాలువలో ఆరు కొండచిలువలు ప్రత్యక్షమయ్యాయి. వీటిని చూసేందుకు ప్రజలు బారులుతీరారు. దీంతో ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తండ్రితో కలిసి భార్యను హతమార్చిన డాక్టర్.. శవాన్ని అంబులెన్సులో 350కి.మీ తీసుకెళ్లి..
    ఓ వైద్యుడు తన తండ్రితో కలిసి భార్యను హతమార్చాడు. అత్తవారు పెళ్లికి కట్నంగా ఇచ్చిన పెట్టెలోనే భార్య మృతదేహాన్ని పెట్టి దూరంగా తీసుకెళ్లి దహనం చేశాడు. ఈ దారుణం ఉత్తర్​ప్రదేశ్​లో వెలుగుచూసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'వైరస్‌లు వేగంగా వ్యాపిస్తున్నాయ్‌ జాగ్రత్త!'.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
    ప్రస్తుత సీజన్‌లో కరోనాతోపాటు ఇతర రకాల వ్యాధికారకాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వైరస్‌ల వ్యాప్తిని కట్టడి చేయడంతో పాటు పౌరులు స్వీయ జాగ్రత్తలు పాటించాలని సూచించింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • క్రెడిట్‌ స్కోర్‌పై ఇవన్నీ అపోహలే.. మరి వాస్తవాలేంటో తెలుసా?
    రుణం పొందడంలో క్రెడిట్​ స్కోర్​ ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే, దీనికి సంబంధించి చాలా మందికి అన్ని విషయాలు తెలియవు. ఈ క్రమంలో క్రెడిట్‌ స్కోర్‌కు సంబంధించి అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయి. ఆ ప్రచారాలు ఏంటి?.. అందులో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • IND VS BAN: గాయపడ్డ కెప్టెన్​​.. ఆంబులెన్స్​లో ఆస్పత్రికి తరలింపు​
    టీమ్​ఇండియాతో టెస్టు సిరీస్​కు ​ముందు బంగ్లాదేశ్​ కెప్టెన్​ గాయపడ్డాడు. అతడిని ఆంబులెన్స్​లో ఆస్పత్రికి తరలించారు. మరోవైపు లంక ప్రీమియర్​ లీగ్​లో యంగ్ ప్లేయర్​ ఆజాం ఖాన్​ తీవ్రంగా గాయపడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అవకాశం వస్తే.. పాకిస్థాన్​ చిత్రాల్లోనూ నటిస్తా: స్టార్‌ హీరో
    అవకాశం వస్తే పాకిస్థాన్​ చిత్రాల్లోనూ నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు బాలీవుడ్ స్టార్ హీరో రణ్​బీర్​ కపూర్​. ఇంకా ఏమన్నారంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details