అనంతపురం జిల్లా పుర పోరులో అధికార పార్టీ జోరు చూపింది. కార్పొరేషన్‌పైనా జెండా ఎగరేసింది. మున్సిపాలిటీల్లోనూ సత్తా చాటింది. అయితే తాడిపత్రి పురపాలక సంఘంపై ఉత్కంఠ నెలకొంది.
జిల్లాలో నగరపాలకసంస్థ, 8 పురపాలక సంఘాలు, రెండు నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. తాజాగా వెలువడిన ఫలితాల్లో అనంతపురం కార్పొరేషన్‌పై వైకాపా జెండా రెపరెపలాడింది. నగరపాలకసంస్థలో 50 డివిజన్లు, మున్సిపాలిటీలు, నగరపంచాయతీల్లో 308 వార్డులున్నాయి. ఏకగ్రీవాలు పోగా 1,115 మంది అభ్యర్థులు బరిలో దిగారు. కార్పొరేషన్లో ఇప్పటివరకు వైకాపా 40, స్వతంత్ర అభ్యర్థి ఒకస్థానంలో గెలుపొందారు.
రాయదుర్గం మున్సిపాలిటీ వైకాపా కైవసం చేసుకుంది. 32 వార్డుల్లో అధికార పార్టీ 30, తెదేపా 2 స్థానాల్లో గెలిచాయి. కల్యాణదుర్గంలోనూ వైకాపా పాగా వేసింది. వైకాపా-19, తెదేపా-4, స్వతంత్రులు-1 స్థానాల్లో గెలుపొందారు. అయితే తాడిపత్రి మున్సిపాలిటీలో ఉత్కంఠ నెలొంది. తాడిపత్రిలో 36 స్థానాలుండగా.. తెదేపా 18, వైకాపా 16, సీపీఐ 1, ఇతరులు 1 చోట గెలుపొందారు. తెదేపా, సీపీఐ, స్వతంత్రులను శిబిరానికి జేసీ వర్గీయులు తరలించారు. ధర్మవరం మున్సిపాలిటీని వైకాపా కైవసం చేసుకుంది. పుట్టపర్తి నగర పంచాయతీ వైకాపా సొంతమైంది.
ఇదీ చదవండి:ఎన్నికల ఫలితాలు: మున్సిపోల్స్‌లో ఫ్యాన్ గాలి