ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దని ప్రజలు కోరుకుంటున్నారని జిల్లా కబడ్డీ ప్రెసిడెంట్ మంజునాథ్ రెడ్డి అన్నారు. 'హైకోర్టు మా స్వప్నం.. అభివృద్ధి మా లక్ష్యం' అంటూ వైకాపా నాయకులు నగరంలో ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్న చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. శాసన మండలిలో పాలన వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకు పంపించినంత మాత్రాన.. దిగులు చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే జగనన్న నాయకత్వంలో మూడు రాజధానులు ఏర్పాటవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
'జగనన్న నాయకత్వంలో మూడు రాజధానులు తధ్యం' - జిల్లా కబడ్డీ ప్రెసిడెంట్ మంజునాథ్ రెడ్డి వార్తలు
అనంతపురం జిల్లాలోని గుంతకల్లులో వైకాపా నాయకులు ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. "హై కోర్టు మా స్వప్నం.. అభివృద్ధి మా లక్ష్యం" అంటూ పార్టీ కార్యాలయం నుంచి మొదలైన ర్యాలీ ఎస్.ఎల్.వి రాజశేఖర్ రెడ్డి కూడలి మీదుగా గాంధీ చౌక్ వరకు కొనసాగింది.
గుంతకల్లులో వైకాపా నాయకులు ప్రదర్శన ర్యాలీ
TAGGED:
మూడు రాజధానుల తాజా వార్తలు