ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తాడిపత్రిలో తెదేపా నేత వాహనంపై వైకాపా నాయకుల దాడి! - తాడిపత్రి తాజా వార్తలు

అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతకి చెందిన వాహనంపై వైకాపా నాయకులు దాడి చేశారు. ఈ కారణంగా ఆప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దాడి దృశ్యాలన్ని సీసీ కెమెరాల్లో నిక్షిప్తం అయ్యాయి.

ysrcp leaders
తాడిపత్రిలో తెదేపా కార్యకర్త సుమోపై వైకాపా నాయకుల దాడి

By

Published : Mar 16, 2021, 4:52 PM IST

అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్ నెలకొంది. అధికార పార్టీకి చెందిన వారు తెదేపాకు చెందిన వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి చిన్న బజార్​లో ఆరో వార్డు తెదేపా ఏజెంట్ గౌస్ మొహిద్దీన్​కు చెందిన టాటా సుమో అద్దాలను ధ్వంసం చేశారు. ఆరో వార్డుకి చెందిన గౌస్ మొహిద్దీన్ ఇటీవల జరిగిన పురపాలిక ఎన్నికల్లో కౌంటింగ్ ఏజెంటుగా ఉన్నారు. పురపాలిక ఎన్నికల్లో తెదేపా ఆరోవార్డుని కైవసం చేసుకుంది. ఓటమిని జీర్ణించుకోలేని అబ్దుల్, అర్షాద్ అనే ఇద్దరు వైకాపా యువ నాయకులు గౌస్ మోహిద్దీన్ ఇంటి వద్దకు చేరి వాహన అద్దాలు ధ్వంసం చేసినట్లు బాధితుడు చెబుతున్నాడు.

ఈ దృశ్యాలు అన్నీ అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈనెల 18న తాడిపత్రి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. ఛైర్మన్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు.

ఇదీ చదవండీ..భారీగా చెల్లని ఓట్లు.. జయాపజయాలపై ప్రభావం

ABOUT THE AUTHOR

...view details