ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సచివాలయ మహిళా ఉద్యోగిపై వైకాపా నేత దాడి - మహిళా వాలంటీర్​పై వైకాపా నేత దాడి వార్తలు

మహిళ ఉద్యోగినిపై వైకాపా నేత దాడికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. మహిళ ఇంటికి వెళ్లి ఘర్షణకు దిగి చేయిచేసుకున్నాడు. వార్డు సచివాలయ సిబ్బంది మహిళకు అండగా నిలిచి విషయాన్ని మున్సిపల్​ కమిషనర్​ దృష్టికి తీసుకెళ్లారు.

ysrcp leader attacked on woman
వార్డు మహిళా సచివాలయ ఉద్యోగిపై వైకాపా నేత దాడి

By

Published : Jun 28, 2020, 10:23 AM IST

అనంతపురం జిల్లా ధర్మవరంలో వార్డు సచివాలయ మహిళా ఉద్యోగిని తేజస్వినిపై వైకాపా నాయకుడు రమణ దాడి చేశాడు. శాంతినగర్​లో ఆమె ఇంటికి వెళ్లిన రమణ తేజస్వినితో ఘర్షణకు దిగాడు. తన వార్డులో సంక్షేమ పథకాలు అందకుండా తేజస్విని అడ్డుకుంటోందని గట్టిగా కేకలు వేస్తూ ఆమెపై చేయి చేసుకున్నాడు. వార్డు సచివాలయ ఉద్యోగులు ఆమెకు అండగా నిలిచి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ధర్మవరం పట్టణ పోలీస్ స్టేషన్​లో తేజస్విని ఫిర్యాదు చేయగా... రమణపై సీఐ కరుణాకర్ కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details