YSRCP Government Careless on Drought Zones :వైఎస్సార్సీపీ అధికారంలో ఉంటే వానలు (Rains in AP 2023) బాగా కురుస్తాయని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతీ సీజన్‌లో చెప్తుంటారు. నేనొచ్చాకే ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయని ఊదరగొడతారు. వైఎస్సార్సీపీ నాయకులైతే.. కరవు, చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కవలలంటూ ఎద్దేవా చేస్తారు. విపత్తుల్ని అడ్డం పెట్టుకుని ఇన్నేళ్లు రాజకీయాలు చేసిన జగన్ ముఠా ఇప్పుడు కరవుపై కనీసం నోరెత్తడం లేదు. వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నా కరవు మండలాలను గుర్తించేందుకు ఏ మాత్రం ఇష్టపడ లేదు. ఈ ఏడాది 26 జిల్లాల్లో తీవ్ర దుర్బిక్ష ఛాయలు ఉన్నా అక్టోబరు ఆఖరు వరకు నిద్ర నటించారు. చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో 103 మండలాల్లోనే కరవు (103 Drought zones) పరిస్థితులున్నాయని ప్రకటించారు.
Cultivation of Crops has Decreased Due to Lack of Rains :రాష్ట్రంలో తీవ్ర వర్షాభావంతో ఈ ఏడాది ఖరీఫ్‌లో (Kharif Crops List) రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. సాగు విస్తీర్ణం సాధారణం కంటే 24 లక్షల ఎకరాలు తగ్గింది. ఉద్యాన పంటలనూ కలిపితే 30 లక్షల ఎకరాల్లో పంటలు వేయలేదు. జూన్, జులైలో వానలు లేక సాగు మందగించింది. వేరుసెనగ సాగు (Groundnut Crop) విస్తీర్ణం 60 శాతం తగ్గింది. విత్తనాలు తెచ్చినా నాటలేకపోయారు. నూనెగింజల పంటల సాగు 48 శాతం, పప్పు ధాన్యాల సాగు 76 శాతానికే పరిమితమైంది. పత్తిసాగు 5 లక్షలకు ఎకరాలకు పైగా తగ్గింది. ఖరీఫ్‌లో సాధారణ విస్తీర్ణంతో పోలిస్తేఒక్క జిల్లాలోనూ 100 శాతం విస్తీర్ణంలో పంటల సాగు లేదు. సత్యసాయి జిల్లాలో 37, చిత్తూరు జిల్లాలో 39, అన్నమయ్య జిల్లాలో 41, పల్నాడు జిల్లాలో 47, ప్రకాశం జిల్లాలో 56 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. అనకాపల్లి జిల్లాలోనూ 66 శాతం విస్తీర్ణంలోనే పంటలు వేశారు.
Drought zones in AP :ఆగస్టులో 361 మండలాల్లో దుర్బిక్షం, 229 మండలాల్లో వర్షపాత లోటు నెలకొంది. వైఎస్సార్, అన్నమయ్య, శ్రీసత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని 184 మండలాల్లోనూ వర్షాభావ పరిస్థితులే. ఎన్టీఆర్ జిల్లాలోని 20 మండలాల్లోనూ దుర్బిక్షమే. ప్రకాశం, పల్నాడు, నెల్లూరు, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని 90 శాతానికి పైగా మండలాల్లో వానలు లేవు. అక్టోబరు నెలాఖరు నాటికి 474 మండలాల్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితులే కరవుకు నిదర్శనం. ఐనా ప్రభుత్వానికి కేవలం 103 కరవు మండలాల్లోనే (103 Drought zones in AP) కరవు కనిపించింది.