ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా కార్యకర్తపై సమీప బంధువు దాడి - హిందూపురం తాజా క్రైం న్యూస్​

హిందూపురంలో వైకాపా కార్యకర్త జబీవుల్లాపై.. అతని సమీప బంధువు కత్తితో దాడి చేశాడు. బాధితుడిని కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ప్రాథమిక విచారణలో ఆస్తి తగాదాగా నిర్ధరించారు. దాడికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ysrcp folllower attacked by his relatives in hindupur because of his property disputes
దాడిలో గాయపడ్డ వైకాపా కార్యకర్త జబీవుల్లా

By

Published : May 24, 2020, 2:14 PM IST

అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని రహమత్​పురంలో అర్ధరాత్రి సమయంలో వైకాపా కార్యకర్త బండ్లపల్లి జబీవుల్లాపై సమీప బందువు కత్తితో దాడి చేశాడు. స్వల్పంగా గాయపడ్డ జబీవుల్లాను హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అయితే దాడికి... ఆస్తి తగాదాలే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం జబీవుల్లా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details