అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ మున్సిపాలిటీ పరిధిలో రూ. 84 లక్షలతో నిర్మించనున్న వివిధ అభివృద్ధి పనులకు స్థానిక శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు.
రాయదుర్గం పట్టణంలోని కూరగాయల మార్కెట్లో రూ.74 లక్షలతో నూతనంగా నిర్మించనున్న షాపింగ్ కాంప్లెక్స్‌కు, డ్రైవర్స్ కాలనీలో రూ.10 లక్షలతో నిర్మించనున్న తాగునీటి పథకం పైప్‌లైన్ నిర్మాణానికి కాపు రామచంద్రారెడ్డి భూమిపూజ చేశారు. పట్టణ ప్రజల అభివృద్ధి సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.