అనంతపురం జిల్లా రాయదుర్గం 29వ వార్డు వైకాపా అభ్యర్థిని వైజాగ్ రిబ్కా.... నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఎన్నికల్లో ఓటమి భరించలేక ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. వైకాపాలో చురుకుగా పాల్గొనే రిబ్కా.. మున్సిపల్ చైర్మన్ రేసులో ఉన్నారు. రాయదుర్గం 29వ వార్డులో పోటీ చేసిన ఈమెపై తెదేపా అభ్యర్థి సీ.జ్యోతి 285 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
పుర ఎన్నికల్లో ఓడిపోయానన్న మనస్థాపంతో ఈ ఘతుకానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను వెంటనే స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రిబ్కాను రాష్ట్ర ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు.