అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా వైకాపా శ్రేణులు ఇంటింటా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. వైకాపా ఇంఛార్జ్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 22వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి సులోచనతో కలిసి ప్రచారం మొదలు పెట్టారు. ముందుగా సుంకులమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. వైకాపా కౌన్సిలర్ అభ్యర్థి, గుత్తి మండల ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసి తమ అభ్యర్థిను గెలిపించాలంటూ కోరారు.
మున్సిపల్ ఎన్నికలు: గుత్తి 22వ వార్డులో వైకాపా ప్రచారం - Municipal elections in Anantapur district
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ 22వ వార్డులో వైకాపా శ్రేణులు ఇంటింటా ప్రచారం కార్యక్రమం నిర్వహించారు.
గుత్తి 22వవార్డులో మొదలైన వైకాపా ప్రచారం