అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహ ఏర్పాటు ఉద్రిక్తతలకు దారి తీసింది. నాలుగు రోజుల క్రితం పంచాయతీ కార్యాలయంలో ఉన్న విగ్రహాన్ని కార్యదర్శికి చెప్పకుండా తీసుకువచ్చారని వైకాపాకు చెందిన ఒక వర్గం ఫిర్యాదు చేసింది. విగ్రహం ఏర్పాటు చేసి నాలుగు రోజులు కావస్తున్నా ఎటువంటి మరమ్మతులు చేయకపోవటంతో ఎక్కడ కూలిపోతుందోనని వైకాపాకు చెందిన మరో వర్గం కార్యకర్తలు వాటికి మరమ్మతులు చేయడానికి వచ్చారు. వారిని అధికారులు, పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి అక్కడకు చేరుకుని అధికారులతో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుండి వెళ్లేదిలేదని అధికారులకు తేల్చి చెప్పారు. తాను కలెక్టర్ తో మాట్లాడానని అన్ని అనుమతులు తీసుకున్నామని మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి అధికారులకు చెప్పే ప్రయత్నం చేశారు. అధికారులు మాత్రం ఉన్నతాధికారులకు తెలియజేసి చెప్తామని.. ఉదయం విగ్రహాం పనులు ప్రారంభించాలని మాజీ ఎమ్మెల్సీ కి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆయన ఇక్కడే ఉండి మరమ్మతులు పూర్తి చేసే వెళ్తానని అధికారులతో అన్నారు.
వైకాపాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ - ex mlc
ఉరవకొండలో వైఎస్ విగ్రహ ఏర్పాటు పార్టీలో రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఉరవకొండ