Worms in YSR kits: అనంతపురం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేసిన వైఎస్సార్ కిట్లలో పురుగులు ప్రత్యక్షమయ్యాయి. వేరుసెనగ చిక్కీలలో పురుగులు వచ్చిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. నగరంలోని పాతూరులో ఉన్న రాణినగర్ కేంద్రం నుంచి పంపిణీ చేసిన కిట్లలో ఈ పురుగులు కనిపించాయి. సమాచారం అందుకున్న అధికారులు.. ఈ కిట్లు పాతవా? కొత్తవా? అనే అంశంపై ఆరా తీస్తున్నారు. మరోవైపు రాణినగర్ ప్రాంతంలో.. వైఎస్సార్ కిట్లను రెండు రోజుల క్రితం.. పంపిణీ చేసినట్లు తెలుస్తోంది.
చిక్కీలలో పురుగుల కలకలం.. వీడియో వైరల్ - Insects are added to the traps
Worms in YSR kits: ఐసీడీఎస్ ఆధ్వర్యంలో.. అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేసిన వైఎస్సార్ కిట్లలో.. పురుగులు ప్రత్యక్షమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో.. సామాజిక మాద్యమాలలో చక్కర్లు కొడుతోంది.. దీనిపై స్పందించిన అధికారులు విచారణ ప్రారంభించారు.
వైఎస్సార్ కిట్లు