అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కరోనా వైరస్ బారిన పడి మృతి చెందిన వారి దహన సంస్కారాలను చేసేందుకు కొందరు యువత స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. కరోనా అంటేనే ముందుకు రాని తరుణంలో.. కొంతమంది యువకులు ధైర్యంగా కొవిడ్ మృతదేహాలకు సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు చేస్తున్నారు. కుటాగుళ్లకు చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతిచెందాడు. అంత్యక్రియలు చేసేందుకు బంధువులు ముందుకు రాలేదు. సమాచారం అందుకున్న 'మనం సైతం కదిరి కోసం' బృందానికి తెలిపారు. స్పందించిన సభ్యులు.. కుటాగుళ్లకు ఆఖరి సంస్కారాన్ని పూర్తి చేశారు. తనకల్లు మండలం బొంతలపల్లిలో కరోనా బారిన పడి మృతి చెందిన వృద్ధుడికి అంత్యక్రియలు చేశారు.
ముందడుగు వేశారు.. కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్నారు! - అనంతపురం జిల్లా వార్తలు
కదిరి నియోజకవర్గంలో కరోనాతో మృతి చెందిన వారికి 'మనం సైతం- కదిరి కోసం' బృంద సభ్యులు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. కరోనా భయానికి అంత్యక్రియలు చేసేందుకు సొంతవాళ్లు ముందుకు రాని పరిస్థితులు అనేక చోట్ల వెలుగుచూస్తున్నాయి. కానీ వీళ్లు మాత్రం సమాచారం అందిన వెంటనే ముందడుగు వేస్తున్నారు. సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.

funerals for covid dead bodies
ఇదీ చదవండి
తండ్రిని కాపాడుకునేందుకు కుమారుడి విఫలయత్నం.. కానీ