.
విద్యుదాఘాతంతో యువకుడి మృతి - youngman died with electric shock in mandapeta ananthapuram district
అనంతపురం జిల్లా మండపేట మండలం తుమ్మలబైలు తండాలో విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందాడు. తుమ్మలబైలు తండాకు చెందిన తిరుపాల్నాయక్ ఇంట్లో సెల్ఫోన్ ఛార్జింగ్ పెట్టారు. ఛార్జర్ తీసే సమయంలో విద్యుదాఘాతానికి గురైన తిరుపాల్ నాయక్ కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతనిని కుటుంబ సభ్యులు చికిత్స కోసం కదిరికి తరలిస్తుండగా... మార్గమధ్యలో మృతి చెందాడు. గాండ్లపెంట పోలీసులు కేసు నమోదు చేసి తిరుపాల్ నాయక్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు.
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
TAGGED:
విద్యుదాఘాతంతో యువకుడి మృతి