అనంతపురం జిల్లా గాండ్లపెంటలో ఓ యువకుడు ప్రేమ పేరుతో మోసం చేశాడని యువతి పోలీసులను ఆశ్రయించింది. నాలుగేళ్లపాటు ప్రేమించుకున్నామనీ.. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు ముఖం చాటేశాడని యువతి ఆరోపించింది. అతనికి ఇటీవలే ఔట్సోర్సింగ్ కింద బ్యాంకులో ఉద్యోగం వచ్చిందని.. కట్నం కోసం మరో అమ్మాయితో వివాహానికి సిద్ధమయ్యాడని తెలిపింది. ఎలాగైనా తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంది.
ప్రేమ పేరుతో యువకుడు మోసం.. న్యాయం కోసం యువతి పోరాటం
ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకుంటానన్నాడు.. నాలుగేళ్లు కలిసి తిరిగాడు. తీరా ఉద్యోగం వచ్చాక ముఖం చాటేశాడు. కట్నం మీద ఆశతో ప్రేమించిన అమ్మాయిని కాదని వేరే యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది.
ప్రేమపేరుతో యువకుడి మోసం.. న్యాయంకోసం యువతి పోరాటం