అనంతపురంలోని ఆజాద్‌నగర్‌లో జ్యోతి అనే యువతిని స్కార్పియో వాహనంలో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. తన తల్లితో కలిసి జ్యోతి సోమవారం సాయంత్రం పని నిమిత్తం బయటకు వెళ్లగా.. తల్లిని తోసేసి యువతిని బలవంతగా లాక్కెళ్లారని జ్యోతి తల్లి అరుణ వెల్లడించింది. దీనిపై నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ లో కుటుంబీకులు ఫిర్యాదు చేశారు.
ఇంకా లభించని కిడ్నాపైన యువతి ఆచూకీ..ఆందోళనలో కుటుంబం - అనంతపురంలో యువతి కిడ్నాప్ కలకలం
అనంతపురంలోని ఆజాద్‌నగర్‌లో సోమవారం సాయంత్రం యువతి కిడ్నాప్ కలకలం రేపింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జ్యోతికి కర్నూలు జిల్లా అవుకు చెందిన భగీరథ అనే కానిస్టేబుల్ తో ఇటీవల నిశ్చితార్థం అయింది. అయితే అతనికి ఇంతకుముందే పెళ్లి జరిగిందన్న విషయాన్ని తెలుసుకుని పెళ్లిని రద్దు చేసినట్లు యువతి తల్లి తెలిపారు. ఇప్పుడు అతనే ఈ ఘటనకు పాల్పడినట్లు వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి యువతి ఆచూకి కోసం గాలిస్తున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. నిన్న కిడ్నాప్ అయిన యువతి అచూకీ ఇంకా లభించకపోవటంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి