ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని.. యువతి ఆత్మహత్య - అనంతపురం వార్తలు

పెళ్లి చేసి కూతురిని అత్తవారింటికి పంపాలనుకున్న ఆ తల్లిదండ్రులకు.. అదే శాపమైంది. పెళ్లి ఇష్టం లేని ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన.. అనంతపురం జిల్లా కోటగుడ్డం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

young-woman-commits
young-woman-commits

By

Published : Dec 26, 2020, 5:26 PM IST

ఇంట్లోవారు బలవంతంగా పెళ్లి చేస్తున్నారని ఆవేదనకు గురైన ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. అనంతపురం జిల్లా కంబదూరు మండలం కోటగుడ్డం గ్రామానికి చెందిన మౌనిక అనే యువతి తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఆలస్యంగా గమనించిన కుటుంబ సభ్యులు మౌనికను ఆసుపత్రికి తరలించే సమయానికి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శవాన్ని పోస్టుమార్టం కోసం కళ్యాణదుర్గం ఆస్పత్రికి తరలించారు. పెళ్లిపీటలెక్కాల్సిన తన కుమార్తె మృతితో తల్లిదండ్రులు, కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.

ABOUT THE AUTHOR

...view details