అనంతపురం జిల్లాలో లాక్ డౌన్ వల్ల ఆహారం దొరక్క అలమటిస్తున్న మూగ జీవాలకు ఉరవకొండ స్వచ్ఛంద సేవ సంస్థకు చెందిన యువకులు అండగా నిలుస్తున్నారు. పెన్నోబలం లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ ప్రాంతంలో వెయ్యికి పైగా వానరాలు ఉన్నాయి. ఎవరో కొందరు భక్తులు ఇచ్చే ఫలహారాలు.. ఇతరత్రా వాటిని తింటూ అవి ఆకలి తీర్చుకునేవి. లాక్ డౌన్ నేపథ్యంలో దేవాలయాలకు భక్తులు రాకపోవటంతో వాటి ఆకలి తీర్చేవారు కరువయ్యారు. ఇది గమనించిన ఆ సంస్థ సభ్యులు ప్రతిరోజు ఫలహారాలు అందిస్తూ.. వాటి ఆకలిని తీరుస్తున్నారు. దేవాలయం సమీపంలో ఉండే యాచకులకు కూడా ఈ సంస్థ ఆహారం అందిస్తుంది.
మూగ జీవుల ఆకలి తీరుస్తున్న యువకులు - ananthapuram district
అనంతపురంలో ఆహారం దొరక్క మూగ జీవులు అలమటిస్తున్నాయి. వాటికి ఆహారం పెట్టేందుకు ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన యువకులు ముందుకు వచ్చారు. దాదాపు వెయ్యికి పైగా వానరాల ఆకలి తీర్చుతున్నారు.
మూగ జీవుల ఆకలి తీరుస్తున్న యువకులు