ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

SUICIDE: ప్రేయసికి మరో వ్యక్తితో పెళ్లైందని యువకుడు ఆత్మహత్య - crime news

అనంతపురం జిల్లా గౌడనకుంట గ్రామంలో పవన్ కుమార్(23) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన అమ్మాయి వేరొకరిని పెళ్లిచేసుకోవడం, ఉద్యోగం పోవడంతో మనస్థాపానికి లోనై ఇలా చేసినట్లు అతని కుటుంబసభ్యులు చెబుతున్నారు.

young man suicided in anantapur district
ప్రేయసికి మరో వ్యక్తితో పెళ్లైందని యువకుడు ఆత్మహత్య

By

Published : Jul 5, 2021, 12:02 AM IST

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం మండలం గౌడనకుంట గ్రామంలో పవన్ కుమార్(23) సివిల్ ఇంజనీరింగ్​ చదువుకున్న యువకుడు.. పొలంలో చింత చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

రెండు సంవత్సరాలుగా బెంగళూరులో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న పవన్ కుమార్ లాక్ డౌన్ కారణంగా నెల రోజుల నుంచి స్వగ్రామానికి వచ్చి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఓ పక్క కరోనా కాలంలో ఉపాధి కోల్పోవడం.. మరో పక్క ప్రేమించిన అమ్మాయికి వారం క్రితం మరో వ్యక్తితో పెళ్లైయిందని తెలుసుకుని మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై అతని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. మృతుని శవాన్ని పంచనామా కోసం ప్రభుత్వాసుపత్రి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details