ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యువకుడు మృతి.. విషపురుగు కుట్టినట్టు అనుమానం - ananthapuram latest news

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామానికి చెందిన ఓ యువకుడు మృతి చెందాడు. శవపరీక్ష నిమిత్తం మృతదేహన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

విషపురుగు కుట్టి యువకుడు మృతి
విషపురుగు కుట్టి యువకుడు మృతి

By

Published : Mar 17, 2021, 8:27 AM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామంలో చిన్న ఎర్రిస్వామి అనే యువకుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. సోమవారం యువకుడు తన సొంత పొలంలో వ్యవసాయ పనికి వెళ్లాడు. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రాలేదు.

సాయంత్రం చీకటి పడినప్పటికి ఇంటికి తిరిగి రావటంతో పొలంలోకి వెళ్లి వెతకగా.. ఓచెట్టు దగ్గర విగతజీవిగా కనిపించాడు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై ధరణిబాబు పరిశీలించి విషపురుగు కాటుతో మృతి చెంది ఉండవచ్చని ప్రాథమికంగా నిర్దరణకు వచ్చారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details