అనంతపురం జిల్లా సోమందేపల్లి శ్మశానవాటికలో ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మద్యం సీసాలు, రాళ్లతో కొట్టి యువకుడి ప్రాణాలు తీశారు. మృతుడు గ్రామానికి చెందిన నాగేంద్రగా గుర్తించారు. నాగేంద్ర గ్రామంలో బేల్దారి పని చేసుకుంటూ... జీవనం సాగిస్తూ ఉండేవాడని స్థానికులు తెలిపారు. మద్యం మత్తులోనే హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
దారుణం: మద్యం సీసాలు.. రాళ్లతో కొట్టి.. యువకుడి హత్య - somamdepalli murder updatees
శ్మశానవాటికలో యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా సోమందేపల్లిలో జరిగింది.
![దారుణం: మద్యం సీసాలు.. రాళ్లతో కొట్టి.. యువకుడి హత్య murder](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11646402-938-11646402-1620194010540.jpg)
యువకుడు హత్య