ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Attack: ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని కారుతో ఢీకొట్టి - అనంతపురం జిల్లాలో యువతిపై హత్యాయత్నం

Murder Attempt: ప్రేమిస్తున్నామంటూ వెంట పడతారు.. అమ్మాయి ఒప్పుకోకపోతే ఎంతకైనా తెగిస్తారు. తనకు అమ్మాయి దక్కలేదనే కక్షతో దాడులకు పాల్పడుతున్నారు. అంతేకాదు.. ప్రాణాలు సైతం తీసేందుకు మృగాళ్లు వెనకాడడం లేదు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో ఓ ఉన్మాది.. యువతిని కారుతో ఢీ కొట్టి చంపేందుకు యత్నించాడు. తీవ్ర గాయాలైన ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటనలో నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Murder attempt
యువతిపై హత్యాయత్నం

By

Published : Aug 3, 2022, 4:14 PM IST

Updated : Aug 3, 2022, 8:51 PM IST

Youngman Attack on Young Woman: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలానికి చెందిన గుజ్జల భాస్కర్‌... అదే గ్రామానికి చెందిన బాలికను.... కొద్ది రోజులుగా ప్రేమ, పెళ్లి పేరుతో వేధిస్తున్నాడు. బాలిక తండ్రి పోస్ట్ మెన్‌గా విధులు నిర్వహిస్తూ ఇటీవల మృతి చెందారు. ఆయన మృతితో భార్యకు ఉద్యోగం ఇచ్చారు. తన తల్లికి చదువు రాకపోవడంతో... ఆమెకు బదులు బాలిక పోస్ట్‌ఆఫీస్‌లో విధులు నిర్వహిస్తోంది. ఇటీవలే కళ్యాణదుర్గానికి బదిలీ అవ్వడంతో అక్కడకు మకాం మార్చారు. అయినా కూడా భాస్కర్‌ వేధింపులు ఆపలేదు. పెళ్లిచేసుకోవాలని.. లేకుంటే చంపేస్తానని బాలికను బెదిరించాడు. అన్న వరస అవుతావని చెప్పి ఆమె పెళ్లికి నిరాకరించింది. కోపంతో పగ పెంచుకున్న భాస్కర్‌.. రెండు రోజుల క్రితం ఒంటరిగా ఉన్న బాలికను బలవంతంగా కారులో ఎక్కించుకున్నాడు. ఆ సమయంలో వాహనంలో నుంచి బాలిక కిందకు దూకింది. తనను పెళ్లి చేసుకోదనే కోపంతో... బాలికకు తీవ్ర గాయాలైనా కనికరం లేకుండా... కారుతో ఢీకొట్టాడు.

ఇది గమనించిన స్థానికులు... కేకలు వేయడంతో.... భాస్కర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ క్రమంలో కారు.. లారీని ఢీకొట్టి అదుపుతప్పి.... చెట్ల పొదల్లో బోల్తా పడింది. స్వల్ప గాయాలతో భాస్కర్‌ బయటపడ్డాడు. స్థానికులు బాలికను దగ్గర్లోని ఆస్పత్రిలో చేర్పించి తల్లికి సమాచారమిచ్చారు. బాలిక తలకు బలమైన గాయమైంది. కాలు విరిగింది. పరిస్థితి విషమంగా ఉండటంతో.. ఆమెను అనంతపురం ఆసుపత్రికి తరలించారు. తన కుమార్తె కొనఊపిరితో కొట్టుమిట్టామిట్టాడుంతోని బాలిక తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. పెళ్లికి నిరాకరించిందనే కారణంతోనే చంపాలనుకున్నాడని తెలిపారు.

బాలిక కుటుంబ సభ్యులను అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తెదేపా మహిళా నేతలు పరామర్శించారు. ప్రేమోన్మాదులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలిక చావుతో కొట్టుమిట్టాడుతుంటే శిక్షించాల్సిన ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని మహిళ నేతలు మండిపడ్డారు.

యువతిని కారుతో ఢీకొట్టి హత్యాయత్నం

ఇవీ చదవండి:

Last Updated : Aug 3, 2022, 8:51 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details