అనంతపురం జిల్లా తనకల్లు మండలం మారెప్పగారిపల్లిలో చెక్క పని చేస్తున్న యువకుడు ప్రమాదానికి గురయ్యాడు. తలుపులు తయారుచేస్తుండగా ప్రమాదవశాత్తూ యంత్రం మీద పడ్డాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడికి కదిరి ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి.. మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
చెక్క పని చేస్తుండగా ప్రమాదం.. యువకుడికి తీవ్రగాయాలు - అనంతపులం జిల్లాలో ప్రమాదంలో యువకుడికి గాయాలు
ఇంట్లో చెక్కపని చేస్తుండగా పొరపాటున యంత్రం మీద పడి యువకుడు తీవ్ర గాయాలపాలైన ఘటన.. అనంతపురం జిల్లా మారెప్పగారిపల్లిలో జరిగింది. బాధితుడు ప్రస్తుతం అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
గాయాలపాలైన యువకుడు
TAGGED:
ananthapuram accident news