దేశం మెుత్తం సైకిల్‌పై చుట్టిరావాలనుకున్నాడు..అనుకున్న వెంటనే యాత్ర ప్రారంభించాడు కేరళకు చెందిన గోకుల్ అనే యువకుడు. 3వేల 650 కిలోమీటర్ల ప్రయాణాన్ని డిసెంబర్ 16న కేరళలో మెుదలుపెట్టి...నేడు అనంతపురం జిల్లా పెనుగొండలోకి ప్రవేశించాడు. తాను ప్రతిరోజూ 100 కిలోమీటర్ల వరకు సైకిల్ ప్రయాణం చేస్తున్నానని...ఇప్పటి వరకు 700 కిలోమీటర్ల ప్రయాణం దిగ్విజయం కొనసాగించానని ఆ యువకుడు తెలిపాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తొక్కుతూ...రాత్రి వేళల్లో సమీప గ్రామాల్లోని దేవాలయాల్లో నిద్రస్తూ....తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు. పచ్చదనం పెంచడం, కాలుష్యాన్ని నివారించటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలుపుతూ..అవగాహన కల్పిస్తున్నాడు.
పచ్చదనం కోసం సైకిల్‌పై దేశయాత్ర - ananthapuram updates
'పచ్చదనం పెంచండి...కాలుష్యాన్ని నివారించండి' అంటూ కేరళకు చెందిన యువకుడు సైకిల్‌పై తిరుగుతూ ప్రచారం కల్పిస్తున్నాడు. దేశవ్యాప్తంగా అవగాహన కల్పించాలని... డిసెంబర్ 16న తన ప్రయాణాన్ని కేరళ నుంచి ప్రారంభించి..నేడు అనంతపురం చేరుకున్నాడు.
పచ్చదనం కోసం సైకిల్‌పై దేశయాత్ర