ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

YOUTH SUICIDE: ప్రాణం తీసిన వివాహేతర సంబంధం.. వివాహిత వేధింపులకు యువకుడి ఆత్మహత్య..

YOUTH SUICIDE: వివాహిత వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గంలో జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అసలేం జరిగిందంటే..

rayadurgam Youth suicide case
ఆత్మహత్య చేసుకున్న యువకుడు పృథ్వి

By

Published : May 13, 2023, 1:19 PM IST

YOUTH SUICIDE: వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. మహిళ వేధింపులు తాళలేక ఓ వ్యక్తి తన ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదక ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే..

జిల్లాలోని రాయదుర్గం పట్టణంలోని రాధాకృష్ణ మున్సిపల్ పాఠశాల సమీపంలో కుత్తీష్ అలియాస్ పృథ్వి అనే వ్యక్తి తన కుటుంబంతో నివాసం ఉండేవాడు. పట్టణంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుని వ్యాపారం చేస్తూ.. వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే అతడికి రాయదుర్గం పట్టణానికి చెందిన సల్మా అనే ఓ వివాహితతో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది.

అయితే ఆమెతో చనువుగా ఉన్నప్పుడు జరిపిన ఫోన్ కాల్​ సంభాషణలు, ఇద్దరూ కలిసి తీసుకున్న చిత్రాలను చూపించి గత కొద్ది కాలంగా తనను.. ఆమె వేధిస్తోందని గతంలో పృథ్వీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే తనను అతడే ఇబ్బంది పెడుతున్నాడని సదరు వివాహిత సైతం పృథ్విపై ఫిర్యాదు చేసింది. వీరిరువురి ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా వారం రోజుల కిందట సదరు వివాహిత ఎస్పీని కలిసి స్పందనలో కూడా ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఇద్దరినీ పిలిపించి విచారణ చేశారు.

శనివారం మళ్లీ వారు విచారణకు రావాలని ఇద్దరికీ పోలీసులు సమాచారం అందించారు. కాగా గురువారం రాత్రి ఆ వివాహిత పృథ్వికి ఫోన్​ చేసి తన ఇంటికి రమ్మని పిలిచిందని సమాచారం. అతడు వెళ్లకపోయేసరికి మరొక వ్యక్తిని పృథ్వి వద్దకు పంపించిందని, దీంతో తప్పని పరిస్థితిలో అతడు ఆ వివాహిత వద్దకు వెళ్లినట్లు, ఆ విషయాన్ని తనతో కూడా చెప్పినట్లు భార్య లలిత తెలిపింది. కాగా.. శనివారం పోలీస్​ స్టేషన్​కు వెళ్లాల్సి ఉందని, ఎవరిని పంపినా సల్మా వద్దకు ఇంకోసారి వెళ్లొద్దని తన భర్తకు చెప్పినట్లు.. పృథ్వి భార్య పోలీసులకు చెప్పింది.

కాగా.. ఉరవకొండకు బంధువుల వివాహానికి వెళ్లి వచ్చాక ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేద్దామని భర్తకు చెప్పి.. ఉదయాన్నే ఆమె ఉరవకొండకు బయలుదేరినట్లు తెలిపింది. అయితే ఆమె వెళ్తుండగా మార్గమధ్యలో తన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం వచ్చినట్లు తెలిపిన ఆమె.. బోరున విలపించింది. తన భర్త ఆత్మహత్య చేసుకునేందుకు వివాహిత వేధింపులే కారణమని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది.

అయితే ఆమె ఫిర్యాదుపై మొదట పోలీసులు కేసు నమోదు చేయకపోవటంతో పోలీస్ స్టేషన్ ఎదుట కూర్చుని బంధువులతో కలిసి ఆమె ధర్నా చేపట్టింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పృథ్వీ వ్యక్తిగతంగా సౌమ్యుడు కావడంతో భారీ ఎత్తున అతడి స్నేహితులు హాస్పిటల్​కు చేరుకోవటంతో రద్దీ వాతావరణం నెలకొంది. కాగా.. ఆ వివాహిత బాధితులు పట్టణంలో చాలా మందే ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. ఆమె పలువురు యువకులను తన ప్రేమలో పడేసి.. మోసం చేసినట్లు పోలీస్ స్టేషన్లో ఆమెపై పలు కేసులు ఉన్నట్లు వారు తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details