సరదా కోసం చేసిన టిక్‌టాక్ వీడియో ఓ యువకుడి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని డి హీరేహాల్ మండలం మురడి గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలుడు టిక్ టాక్ చేస్తూ గాయపడ్డాడు. తన ఇద్దరు స్నేహితులతో బాధితుడు కలిసి బళ్లారి రోడ్డులోని కల్యామ్ గ్రామం వైపు వెళ్లాడు. స్నేహితుల్లో ఒకరు ద్విచక్ర వాహనానికి పెట్రోలు పోయించడానికి వెళ్లాడు.
టిక్‌టాక్ కోసం విద్యుత్ స్తంభం ఎక్కాడు... తరువాత? - టిక్‌టాక్ కోసం కరెంట్ స్తంభం ఎక్కిన యువకుడు న్యూస్
టిక్‌టాక్ మీద మోజులో పడి ప్రాణాలనే పణంగా పెడుతున్నారు కొందరు. ఆటవిడుపు కోసం వాడాల్సిన యాప్‌ను అదే ఒక యజ్ఞంగా దాని ధ్యాసలోనే సమయాన్ని గడిపేస్తున్నారు. రైల్వే ట్రాక్ లైన్‌కున్న తీగలను తాకేందుకు విద్యుత్ స్తంభం పైకి ఎక్కి ఓ యువకుడు..టిక్‌టాక్ చేయబోయాడు. ప్రమాదవశాత్తు ఆ బాలుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా డి.హీరేహాళ్‌లో జరిగింది.
టిక్‌టాక్ కోసం విద్యుత్ స్తంభం ఎక్కాడు... తరువాత?
మిగిలిన ఇద్దరిలో ఒకరు టిక్‌టాక్ చేద్దామని సమీపంలోని రైల్వే ట్రాక్ లైన్‌కు ఉన్న తీగలను తాకేందుకు విద్యుత్ స్తంభం పైకి ఎక్కాడు. కింద ఉన్న మరో స్నేహితుడు వీడియో తీస్తున్నాడు. తీగలను తాకే ప్రయత్నంలోనే విద్యుదాఘాతానికి గురై బాలుడు కిందపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. స్నేహితులు అతడిని రాయదుర్గం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:అర్ధరాత్రి భారీ వర్షం.. రైతు ఇంటిపై పిడుగు
Last Updated : Jun 29, 2020, 5:15 PM IST