ప్రేమ విఫలమవడంతో ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకొని పురుగులమందు తాగాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి కొండపై జరిగింది. కులమతాలకు అతీతంగా ఎవరు ప్రేమించకండి అంటూ విడపనకల్ మండలానికి చెందిన సుధాకర్... పురుగులమందు తాగుతూ సెల్ఫీ వీడియోను తీసుకొని.. తన మిత్రులకు పంపాడు.
ప్రేమ విఫలమైందని యువకుడు ఆత్మహత్యాయత్నం - అనంతపురం జిల్లా తాజా వార్తలు
' కులమతాలకు అతీతంగా ఎవరు ప్రేమించవద్దంటూ ' .. సెల్ఫీ వీడియో తీసుకొని ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో జరిగింది. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.
ప్రేమ విఫలమైందని యువకుడు ఆత్మహత్యయత్నం
వారు ఆ దృశ్యాలు చూసిన వెంటనే ఘటన స్థలానికి చేరుకొని.. అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందించి పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం తరలించారు. ప్రేమ విఫలం కావటం వల్లే ఈ ఘటన పాల్పడినట్లు.. పలువురు భావిస్తున్నారు.
ఇదీ చదవండీ...స్టీల్ ప్లాంట్‌పై మరోసారి ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ