ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇరుగుపొరుగు వారు తిట్టారని యువతి ఆత్మహత్య - ఇరుగుపొరుగు వారు తిట్టారని యువతి ఆత్మహత్య

ఇరుగుపొరుగున ఉన్న ముగ్గురు వ్యక్తులు అసభ్యంగా మాట్లాడటాన్ని జీర్ణించుకోలేక ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన అనంతపురం జిల్లా కదిరిలో జరిగింది.

young-lady-suicide
young-lady-suicide

By

Published : Aug 27, 2020, 1:52 PM IST

అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని సైదాపురానికి చెందిన వెంకటరమణ కుమార్తె పుష్పాంజలి బి. పార్మసీ చదువుతోంది. తల్లిదండ్రులు పొలం వద్దకు వెళ్లగా పుష్పాంజలి ఒక్కతే ఇంట్లో ఉన్న విషయాన్ని గుర్తించిన నగేష్, కేశవ, నాగేశ్వరమ్మ గొడవ పడి దుర్భాషలాడారు. ఈ ఘటనతో మనస్తాపానికి గురైన పుష్పాంజలి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు.. ఫ్యానుకు వేలాడుతున్న కుమార్తెను చూసి గుండెలు పగిలెలా ఏడ్చారు. తమ బిడ్డ చావుకు కారణమైన వారిని శిక్షించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details