అనంతపురం జిల్లా తనకల్లు మండలం గుర్రంబైలులో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. గ్రామానికి చెందిన యువతి డీఈడీ పూర్తి చేసింది. ఓ యువకుడిని ప్రేమిస్తున్నట్లు కుటుంబసభ్యులకు తెలిపింది. కుటుంబసభ్యులు ఆమెను మందలించారు. అది జీర్ణించుకోలేక ఆమె ఇంటినుంచి వెళ్లిపోయింది. కొక్కంటి క్రాస్ సమీపంలోని హంద్రీనీవా కాలువ గట్టున యువతి చెప్పులు, వివరాలతో కూడిన ఇతర వస్తువులు స్థానికులు గుర్తించారు. ఆమె కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు.
ప్రేమించిన వ్యక్తిని కుటుంబసభ్యులు నిరాకరించారని యువతి ఆత్మహత్య - అనంతపురం జిల్లాలో యువతి ఆత్మహత్య వార్తలు
ప్రేమించిన వ్యక్తిని కుటుంబసభ్యులు నిరాకరించారని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా తనకల్లు మండలం గుర్రంబైలులో జరిగింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల ఘటనా స్థనానికి చేరుకుని కాలువలో గాలించారు. ఫలితం లేకపోయింది. దిగువతొట్లీపల్లి సమీపంలో యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని బయటకు తీసి..ఆమె కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. కోపంతో ఇంటినుంచి వెళ్లిపోయిన కూతురు విగతజీవిగ మారడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రేమను కాదన్నందుకే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.
ఇదీ చదవండి: పుర ఎన్నికల్లో పోటీకి అనుమతివ్వాలని హైకోర్టులో పిటిషన్