రెండేళ్లుగా తిరుగున్నా భూమి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం లేదని విసిగిపోయిన యువరైతు.. రెవెన్యూ కార్యాలయం ముందు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అనంతపురం జిల్లా చండూరు మండల కేంద్రానికి చెందిన యువరైతు వెంకటేశ్.. రెండేళ్ల క్రితం భూమి కొనుగోలు చేశాడు. అన్లైన్లో నమోదు చేయడానికి సంబంధించిన దస్తావేజులు స్థానిక రెవెన్యూ కార్యాలయంలో ఇచ్చాడు. ఆన్లైన్లో ఎక్కించాలని రెండేళ్లుగా కాళ్లరిగేలా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోట్లేదని మస్తాపంచెందాడు. ఆవేదనతో కార్యాలయం ఎదుటనే ఆ పెట్రోలు పోసుకుని నిప్పంటించుకోబోయాడు. గమనించిన ఇతర రైతులు అతన్ని వెంటనే పక్కకు తీసుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకుని ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
రెవెన్యూ కార్యాలయం ఎదుట యువరైతు ఆత్మహత్యాయత్నం
అనంతపురం జిల్లా చండూరు రెవెన్యూ కార్యాలయం ఎదుట ఓ యువరైతు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆన్లైన్లో భూమి నమోదు కోసం రెండేళ్లుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రెవెన్యూ కార్యాలయం ఎదుట యువరైతు ఆత్మహత్యాయత్నం
Last Updated : Nov 16, 2020, 5:11 PM IST