ద్విచక్ర వాహనానికి పోలీస్ స్టికర్ వేసుకొని రాజశేఖర్ అనే వ్యక్తి ఓ యువతిని నమ్మించాడు. అనంతపురం జిల్లాలోని ఓ గ్రామానికి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం ఓ ఏఆర్ కానిస్టేబుల్‌కు ఫోన్ చేసి పిలిపించాడు. అతడూ.. ఆ యువతిపై అత్యాచారం చేశాడు. బాధితురాలు ఈ విషయాన్ని 100కి ఫోన్ చేసి చెప్పింది. బుక్కరాయసముద్రం పోలీసులు కేసు నమోదు చేసి... ఏఆర్‌కానిస్టేబుల్, రాజశేఖర్‌తోపాటు వీరికి సహకరించిన నరేశ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కానిస్టేబుల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ సత్యయేసుబాబు ఆదేశించారు. ద్విచక్ర వాహనానికి పోలీస్ స్టిక్కర్‌తో రాజశేఖర్ గతంలో నేరాలకు పాల్పడ్డాడ అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీస్‌నంటూ నమ్మించి.. యువతిపై అత్యాచారం.. ఆపై కానిస్టేబుల్‌ను పిలిపించి - అనంతపురం క్రైమ్ వార్తలు
ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనానికి పోలీస్ స్టిక్కర్ వేసుకున్నాడు. తాను పోలీస్ అన్నట్లుగా ఓ యువతి నమ్మించి.. తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆపై ఓ కానిస్టేబుల్‌ను పిలిపించగా.. అతడూ.. ఆ యువతిపై అత్యాచారం చేశాడు.

yong man and police constable raped girl in ananthapuram district