అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో రైతులు పండించిన వేరుశనగ, వరి, మొక్కజొన్న పంటలను అనంతపురం ఏరువాక శాస్త్రవేత్తలు పరిశీలించారు. జూన్, జులై నెలలో సాగు చేసిన వేరుశనగ పంటకు అధిక వర్షంతో పంట ఏపుగా పెరిగినా.. కాయలు మాత్రం తక్కువగా ఉన్నాయని తెలిపారు. అధిక దిగుబడి పొందేందుకు కావల్సిన సూచనలను శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. వేరుశనగలో ఆకుమచ్చ తెగులు నివారణకు ఒక ఎకరా పంటకు 400 ml హెక్సాకోనాజోల్ పిచికారి చేయాలిని చెప్పారు. రాగి పంటలో అగ్గి తెగులు నివారణకు ఒక ఎకరాకు 500 గ్రాములు మాంకోజెబ్... అలాగే 200 గ్రాములు కార్బండిజమ్ పిచికారి చేయాలని తెలిపారు. మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు నివారణకు 80 గ్రాముల ఏమామెక్టిన్ జెంబోయేట్ పిచికారి చేయాలని సూచించారు.
పంటలను పరిశీలించిన జిల్లా ఏరువాక శాస్త్రవేత్తలు - మడకశిరలో ఏరువాక శాస్త్రవేత్తలు తాజా వార్తలు
మడకశిర నియోజకవర్గంలో రైతులు పండించిన పంటలను జిల్లా ఏరువాక శాస్త్రవేత్తలు పరిశీలించారు. అధిక దిగుబడి పొందేందుకు కావల్సిన సూచనలను శాస్త్రవేత్తలు అందించారు.
పంటలను పరిశీలిస్తున్నజిల్లా ఏరువాక శాస్త్రవేత్తలు