Yerritata Swamy Temple: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వై.రాంపురం గ్రామంలో ఎర్రితాత స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా అర్చకులు స్వామివారి జీవ సమాధికి అభిషేకం, అలంకరణ, అర్చన పూజలను నిర్వహించారు. వివిధ రకాల పూలతో ఆలయాన్ని అలంకరించి.. భాజాభజంత్రీల నడుమ స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు.
ఉరవకొండలో వైభవంగా ఎర్రితాత రథోత్సవం - ఉరవకొండలో అత్యంత వైభవంగా ఎర్రితాత రథోత్సవం
Yerritata Swamy Temple: ఉరవకొండ మండలం వై.రాంపురం గ్రామంలోని ఎర్రితాత స్వామి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా అర్చకులు స్వామివారి జీవ సమాధికి అభిషేకం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు.
ఉరవకొండలో అత్యంత వైభవంగా ఎర్రితాత రథోత్సవం
రథంపై ఉత్సవ విగ్రహాలను కొలువుదీర్చి రథాన్ని లాగారు. ఈ రథోత్సవంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: పెచ్చుమీరుతున్న అధికారుల అరాచకాలు..డిపాజిట్ కట్టలేదని కుళాయి గొట్టాలకు బిరడాలు..!