ఎంపీపీ పదవి ఇస్తానని చెప్పి మాట మార్చారంటూ.. అనంతపురం జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి వైకాపా ఎంపీటీసీ రామలక్ష్మమ్మ.. పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి.... ఎన్నికలకు ముందు మండల అధ్యక్ష పదవి ఇస్తానని హామీ ఇచ్చారని రామలక్ష్మమ్మ చెబుతున్నారు. ఫలితాలు వెలువడ్డాక కూడా ఇదే విషయాన్ని చెప్పారని తీరా.. ఎన్నికకు ఒకరోజు ముందు మాటమార్చారని ఆరోపిస్తున్నారు. పార్టీ పెద్దల ఆదేశంతో ఎన్నికల్లో పోటీ చేసి భారీగా డబ్బు ఖర్చు చేశామని..ఇప్పుడు మొండిచేయి చూపడం బాధ కలిగిస్తోందని రామలక్ష్మమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త ఆదినారాయణతో కలిసి వైకాపా సభ్యత్వానికి, తన ఎంపీటీసీ స్థానానికి రాజీనామా చేస్తున్నానని రామలక్ష్మమ్మ ప్రకటించారు .
ఎంపీపీ పదవి ఇస్తానని ఎమ్మెల్యే మాట మార్చారు: వైకాపా ఎంపీటీసీ - కుమ్మరవాండ్లపల్లి వైకాపా ఎంపీటీసీ రాజీనామా
అనంతపురం జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి వైకాపా ఎంపీటీసీ రామలక్ష్మమ్మ పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. ఎంపీపీ పదవి ఇస్తానని.. కదరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి మాట మార్చారని ఆరోపించారు.
ycrcp