రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌కు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ విజ్ఞప్తి చేశారు. కియా సంస్థ తరలిపోతుందని అవాస్తవ ప్రచారాన్ని రాయిటర్స్ సంస్థ ద్వారా చంద్రబాబు సృష్టించి భంగపడ్డారని ఆరోపించారు. రాయలసీమ జిల్లాల్లో ఇంకా దుర్భర పరిస్థితులు కొనసాగుతున్నాయన్న ఆయన.. ఆ ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవద్దని చంద్రబాబును కోరారు.
'రాయిటర్స్ సంస్థను చంద్రబాబు ప్రభావితం చేశారు'
రాయిటర్స్ సంస్థను చంద్రబాబు ప్రభావితం చేసి కియా తరలిపోతోందనే వార్తను ప్రచారం చేయించారని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఆరోపించారు. రాయలసీమ జిల్లాల్లో దుర్భర పరిస్థితులు ఉన్నాయని.. ముఖ్యమంత్రి జగన్ చేస్తున్నది ఇంకా తక్కువేనన్నారు.
కియా విషయంలో చంద్రబాబుపై గోరంట్ల మాధవ్ విమర్శలు