అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో వైకాపా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామిని కలిశారు. శివరామకృష్ణ కమిటీ, శ్రీకృష్ణ కమిటీల నివేదికలను మాజీ మంత్రి నారాయణ అణిచి వేశారని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి విమర్శించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేసి తాత్కాలిక రాజధానిని నిర్మించిందని తెలిపారు. ఈ రకంగా రాజధాని నిర్మాణం చేపడితే ఎక్కువ సమయం పడుతుందన్నారు. రాజధాని నిర్మాణానికి ఖర్చు చేసే డబ్బంతా సంక్షేమ పథకాలకు వెచ్చిస్తే ప్రజలు ఆనందంగా ఉంటారని తెలిపారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి జగన్ ధ్యేయమని స్పష్టం చేశారు.
'రాజధాని ఖర్చును పథకాలకు వెచ్చిస్తే ప్రజలు హర్షిస్తారు' - ycp mlc janga krishnamurty latest news
రాజధాని అమరావతికి ఖర్చు పెట్టాల్సిన లక్షల కోట్లను... అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఖర్చు పెడితే ప్రజలు హర్షిస్తారని వైకాపా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తెలిపారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకే ముఖ్యమంత్రి జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని పునరుద్ఘాటించారు.
రాజధాని ఖర్చును పథకాలకు వెచ్చిస్తే ప్రజలు హర్షిస్తారన్న ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి