వైకాపా వందరోజుల పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. జగనన్న పాలనలో ప్రజలు సంతృప్తితో ఉన్నట్లు అన్ని సర్వేలు తెలిపాయని ఆయన అన్నారు. కొన్ని వర్గాల ప్రజలు మాత్రమే పార్టీల పరంగా వ్యతిరేకతతో ఉన్నట్లు చెప్పారు. రెండు లక్షల కోట్ల లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ మేనిఫెస్టోనే ప్రధాన అజెండాగా చేసుకొని అభివృద్ధి వైపు సాగుతున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఈ ఏడాది చివర్లో పేరూరు డ్యామ్‌కు ఒక టీఎంసీ నీటిని తీసుకురానున్నట్లు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి వెల్లడించారు.
'వంద రోజుల వైకాపా పాలన...సంతృప్తిలో ప్రజలు'
జగన్ వంద రోజుల పాలనలో ప్రజలు సంతృప్తితో ఉన్నారని రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి అన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న హామీలను నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి ముందుకెళ్తున్నారని అనంతపురం ఆర్ అండ్ బీ అతిథి గృహంలో నిర్వహించిన సమావేశంలో అన్నారు.
వంద రోజుల వైకాపా పాలన... పూర్తి సంతృప్తిలో ప్రజలు: రాప్తాడు ఎమ్మెల్యే