అనంతపురం జిల్లాలో కాలువలకు నీటి విడుదలపై నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశంలో ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ఐఏబీ సమావేశంలో నీటి విడుదలపై అనంతపురం, కడప జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. ఏ కాలువకు ఎంత నీరిస్తారు, ఏ చెరువును ఎలా నింపుతారనే విషయంలో స్పష్టత కొరవడిందంటూ ఎమ్మెల్యేలు జలవనరులశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తప్పుల తడకగా ప్రణాళికలు తయారుచేసి హెచ్ఎల్సీ, హంద్రీనీవా నీటిని నాలుగేళ్లుగా వృథా చేశారంటూ ధర్మవరం, అనంతపురం ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డిలు మండిపడ్డారు. కాలువ చివరి ఆయకట్టు నుంచి తొలుత నీటిని విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. హెచ్ఎల్సీ కాలువ పరిధిలో కడప జిల్లా పేరే లేకుండా చేశారని, అధికారులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆ జిల్లాకు చెందిన ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే రవీంధ్రనాథరెడ్డిలు సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు.
ఆగ్రహావేశాల మధ్య ఐఏబీ సమావేశం - officials
అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన ఐఏబీ సమావేశం ప్రజాప్రతినిధుల ఆగ్రహావేశాల మధ్య కొనసాగింది. హంద్రీనీవా నుంచి పీఏబీఆర్కి నీరు విడుదల చేయాలంటూ వైకాపా శాసనసభ్యులు అనంతవెంకట రామిరెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే ఆగ్రహం