అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడు పార్థసారథి మూడు రాజధానుల ఏర్పాటు అంశంలో... న్యాయవాదులపై చేసిన వ్యాఖ్యలను వైకాపా లీగల్ సెల్ ఖండించింది. మూడు చోట్ల రాజధానులు ఉంటే న్యాయవాదులు మూడు పెళ్లిళ్లు చేసుకొని మూడు చోట్ల ఉండాలని మాట్లాడటం సరికాదన్నారు. పార్థసారథిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ సత్యయేసుబాబుకు ఫిర్యాదు చేశారు.
'తెదేపా నేత పార్థసారథిపై క్రిమినల్ కేసు నమోదు చెయ్యాలి' - ananthapuram tdp leader parthasarathy cooments on rajadhani
అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడు పార్థసారథి మూడు రాజధానుల ఏర్పాటు అంశంలో... న్యాయవాదులపై చేసిన వ్యాఖ్యలను వైకాపా లీగల్ సెల్ బాధ్యులు ఖండించారు.
తెదేపా నేత పార్థసారథిపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన వైకాపా లీగల్ సెల్ న్యాయవాదులు