అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం పంచాయతీ పరిధిలోని 60 కుటుంబాలకు చెందిన 300 మంది వైకాపా కార్యకర్తలు తెలుగు దేశం పార్టీలోకి చేరారు. వీరిని కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడుతో పాటు నియోజకవర్గంలోని ఇతర నాయకులు.. పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు.
'ప్రభుత్వ పథకాలు అందకపోవడం వల్లే పార్టీ మారుతున్నాం' - అనంతపురం జిల్లాలో తెదేపాలోకి చేరికలు
అనంతపురం జిల్లా తిమ్మసముద్రం గ్రామానికి చెందిన 300 మంది వైకాపా కార్యకర్తలు తెదేపాలోకి చేరారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలు అందకపోవడంతో పార్టీ మారినట్లు వారు తెలిపారు.
తెదెపాలోకి చేరిన వైకాపా కార్యకర్తలు
అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకపోవటంతో తాము తెదేపాలోకి చేరుతున్నట్లు తిమ్మసముద్రం మాజీ సర్పంచ్ కుమారుడు వెంకటేశులు అన్నారు. పార్టీలో చేరిన వారందరికీ సముచిత గౌరవం ఇస్తామని ఉమామహేశ్వర నాయుడు హామీ ఇచ్చారు.
ఇదీచదవండి.