HULCHAL: ‘మూడేళ్లుగా గుంతకల్లు ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి, జిల్లా అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. అప్పు చేసి రూ.8.24 లక్షలతో పామిడి కస్తూర్బా విద్యాలయంలో డ్రైనేజీ పనులు చేశాం. నయా పైసా బిల్లు చెల్లించలేదు. పదుల సార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేదు. బిల్లు ఇవ్వకపోతే ఇక్కడే పురుగు మందుతాగి చనిపోతాం’ అంటూ వైకాపా నాయకులు రామకృష్ణయ్య, నారాయణస్వామి బెదిరించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి స్పందన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. వైకాపా నాయకులు పురుగుమందు డబ్బా బయటకు తీసి బెదిరించిన తీరుతో కలెక్టర్ నాగలక్ష్మి కంగుతిన్నారు. అక్కడే ఉన్న పోలీసులు డబ్బాను లాగేసుకున్నారు.
HULCHAL: బిల్లు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటాం..పురుగుమందు డబ్బాతో వైకాపా నాయకుల బెదిరింపు - అనంతపురం జిల్లా తాజా వార్తలు
HULCHAL: మూడేళ్లుగా ఎమ్మెల్యే, జిల్లా అధికారుల చుట్టూ తిరుగుతున్న బిల్లులు మంజూరు చేయడం లేదని.. బిల్లు ఇవ్వకపోతే ఇక్కడే పురుగు మందుతాగి చనిపోతాం అంటూ వైకాపా నాయకులు బెదిరించారు. అనంతపురం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి స్పందన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది.
బిల్లులు చెల్లించకపోతే ఎలా బతకాలని కలెక్టర్‌ను ప్రశ్నించారు. నిధులు రాగానే బిల్లు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. పోలీసులు వారిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. అనంతరం రామకృష్ణయ్య, నారాయణ స్వామి మాట్లాడుతూ.. ‘‘2019లో తమ పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి కస్తూర్బా బాలికల విద్యాలయంలో డ్రైనేజీ పనులు అప్పగించారు. రూ.10 లక్షల అంచనాతో పనులు చేపట్టాం. అదే ఏడాది ఆగస్టు నాటికి రూ.8.24 లక్షలతో పని పూర్తిచేశాం. అప్పు చేసి పనులు చేశాం. అప్పటి నుంచి బిల్లుల కోసం తిరుగుతున్నాం. ఎమ్మెల్యేకు ఐదుసార్లు విన్నవించాం’’ అని వాపోయారు.
ఇవీ చదవండి: