అనంతపురం జిల్లా విడపనకల్లో నిర్వహించిన వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో వైకాపా నేతల మధ్య మరోసారి వర్గ పోరు బయటపడింది. ఒకే వేదికపై వైకాపా వర్గీయులు బాహాబాహీకి దిగడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి వర్గీయులు వేదిక మీదకు రావడాన్ని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి వ్యతిరేకించటంతో ఇరు వర్గాల నాయకులు కొద్దిసేపు వాదులాడుకున్నారు. అనంతరం శివరామిరెడ్డి వర్గీయుడు వెనుదిరిగి వెళ్ళిపోయాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ వర్గ పోరు ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతోందని నియోజకవర్గ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వైకాపాలో వర్గ పోరు...బాహాబాహీకి దిగిన నేతలు - వైకాపా నేతల మధ్య వివాదం తాజా వార్తలు
అధికార పార్టీనేతల మధ్య మరోసారి వర్గపోరు బయటపడింది. అనంతపురం జిల్లా విడపనకల్లో నిర్వహించిన వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో రెండు వర్గాలకు చెందిన నేతలు బాహాబాహీకి దిగారు.
వైకాపాలో వర్గ పోరు...బాహాబాహీకి దిగిన నేతలు