అనంతపురం జిల్లా బేలుగుప్ప మండలంలోని పంచాయతీ ఎన్నికల్లో వైకాపా తరపున గెలిచిన వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైకాపా ఇంఛార్జ్ ఎస్వీ మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి, వైకాపా నేత నదీమ్ అహ్మద్ హాజరయ్యారు. మెుదటి రెండు విడతల్లో వైకాపా 85 శాతం, తెదేపా 15 శాతం సీట్లు గెలిచిందని ఎస్వీ మోహన్ రెడ్డి తెలిపారు. వచ్చే మూడో విడత ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే వెల్లడవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చడం వల్లే ప్రజలు వైకాపాకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.
"మూడో విడతలోనూ వైకాపాదే విజయం" - sv mohanreddy
అనంతపురం జిల్లా బేలుగుప్ప మండలంలోని పంచాయతీ ఎన్నికల్లో వైకాపా తరపున గెలుపొందిన వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైకాపా జిల్లా ఇంఛార్జ్ ఎస్.వి మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన అయన.... రాబోయే రెండు విడతల్లో కూడా వైకాపా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
గెలుపోందిన అభ్యర్థుల సన్మాన కార్యాక్రమం