అనంతపురం జిల్లా కూడేరు మండలంలోని చోళసముద్రంలో తెదేపా-వైకాపా నేతల దాడి స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. పంచాయతీ ఎన్నికలలో తెదేపా మద్దతుదారుల విజయాన్ని జీర్ణించుకోలేని అధికార పార్టీ మద్దతుదారులు తెదేపా కార్యకర్త ఇంటిపై దాడికి యత్నించారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రతిదాడికి సన్నద్ధమయ్యారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య జరిగిన తోపులాటలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామంలో పెద్దఎత్తున మోహరించిన పోలీసులు.. బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఓటమి జీర్ణించుకోలేక దాడులు.. ముగ్గురికి తీవ్రగాయాలు
పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేక గెలిచినవారిపై పలువురు దాడులకు పాల్పడుతున్నారు. అనంతపురం జిల్లా చోళసముద్రంలో అధికార పార్టీకి చెందిన కొందరు తమపై దాడి చేశారని తెదేపా కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఇరు వర్గీయుల మధ్య చెలరేగిన ఘర్షణలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ఓటమి జీర్ణించుకోలేక దాడులకు పాల్పడుతున్న వైకాపా వర్గీయులు
మూడు రోజులుగా తెదేపా కార్యక్తలను లక్ష్యంగా చేసుకుని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ.. దాడులకు యత్నిస్తున్నారని బాధితులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఓ కార్యకర్త ఇంటోకి ప్రవేశించి మహిళలపై దాడికి యత్నించారని పలువురు గ్రామస్థులు పేర్కొన్నారు. అధికార పార్టీ ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని వాపోయారు.
ఇదీ చూడండి:'వైకాపా నేతలు దాడులు చేస్తున్నారు.. చర్యలు తీసుకోండి'